వడ్డెర రిజర్వేషన్ పోరాట సమితి

స్వాగతం,

వడ్డెర రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్పీఎస్) కేవలం సంఘం మాత్రమే కాదు ఇది దేశంలోనే వడ్డెర్లకు అందించాల్సిన అన్ని వసతులు, రిజర్వేషన్లు, అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఒక సంస్థగా కూడా చెప్పవచ్చు. ఏ సంఘమైన కేవలం కొంత మేరకే అభివృద్ధి కార్యక్రమాల కోసం పోరాడుతుంది. కాని వీఆర్పీఎస్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న వడ్డెర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సాధ్యమైనంత వరకు మొక్కవోని దీక్షతో కృషి చేస్తూ ముందుకు సాగుతుంది.

వీఆర్పీఎస్ ఎలా పురుడు పోసుకుంది....

నిప్పుల కొలిమిలో నలిగిన బంగారమే, అందరినీ సంతోషపెట్టే అభరణం అవుతుంది, సమాజంలో గుర్తింపు లెని జాతులు, తెగలలో ఎదురైన అవమానాలు, బాధలు, రాజ్యాంగ శిల్పి, వెనుకబడిన వర్గాల దేవుడు డాక్టర్, బి.ఆర్ అంబేద్కర్ గారిని దేశానికి అందించాయు, ఆదే విధంగ స్వాతంత్ర్యం దేశానికి వచ్చింది కానీ వడ్డెర కులానికి కాదు అన్నట్టు అనె స్థితిలో ఉన్న వడ్డెర కులంలో, కుల వృత్తులు ఆయిన భవన నిర్మాణ కార్మిక కుటుంబంలో పుట్టి, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ, 'లా' డిగ్రీ పూర్తీ చేసిన న్యాయవాది, క్వారిలలో రాతి పనీ చెసే కుంటుంబం నుండీ ఉన్నత విద్యావంతులుగా ఎదిగిన మారో ఇద్దరు యువకులు, ఇ ముగ్గురి ఆలోచనల కలయిక, రాబోవు తరాలకు స్వేచ్ఛ వాయువు సాధన దిశగ ఏదో ఒకటి చెయ్యాలి.... అసలు మన జాతి వెనుకబాటుకు కారణం ఏమిటి, అనె వీరి అలోచనకు దొరికిన సమాధానం, ఆర్ధికంగా, సామాజికంగా, విధ్య ఉద్యోగ పరంగా సమాజంలో అట్టడుగు స్థానంలో ఉండడం, మరి ఇ పరిస్థితులలో మర్పు కోసమే కధ రిజర్వేషన్లు, ఏర్పడింది, అయిన కూడా, వడ్డెర జాతి పరిస్తితి ఎందుకుఇలా వుంది అని, శోధించి సాధించి తెలుసుకున్నది ఒక్కటే నాడు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియలో వడ్డేర్లకు జరిగిన అన్యాయం , వడ్డెర జాతి భవిష్యత్తూ మనుగడ సాధించాలి , భావితరాలు స్వేచ్ఛగ బ్రతకాలి అంటె నాడు న్యాయంగ రావాల్సిన రిజర్వేషన్, అది సాధించడం కోసం సమిష్టి పోరాటం అవసరం అనె అలోచనే , 'వడ్డెర రిజర్వేషన్ పోరాటసమితి' ఆవిర్బానికి మూలకారణం. సామాన్యమైన కుటుంబాలలో పుట్టిన ముగ్గురు ఉన్నత విద్యావంతులుగా ఎదగడానికి పడ్డ కష్టాల, విధ్య ఉద్యోగం ఉపాధి, వంటి వాటిలో వీరు ఎదుర్కొన్న కష్టాలను వడ్డెర జాతి బిడ్డలకు దూరం చేయ్యాలి అనె అసామాన్యమైన దీక్షకు దిక్సూచి, ఒక తాపీ మేస్త్రి( భవన నిర్మాణం )పని చేసుకునే కుటుంబంలో పుట్టిన గుంజి సంతోష్ కుమార్, వడ్డే రాజ్ (న్యాయవాది), మరియు తమ్మిశెట్టి శివకృష్ణ (సైన్స్ పరిశోధన విద్యార్థి), బత్తుల ఉఎంద్ర (జర్నలిస్టు)లు.

Executive Committee


గుంజ సంతోష్ కుమార్ వడ్డే రాజు

గుంజ సంతోష్ కుమార్ వడ్డే రాజు

వీఆర్పీఎస్ అధ్యక్షుడు

వీఆర్పీఎస్ వ్యవస్థాపకుడు

బత్తుల ఉపేంద్ర

బత్తుల ఉపేంద్ర

వి ఆర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

వి ఆర్ పి ఎస్ వ్యవస్థాపకులు లో ఒక్కడు

తమ్మిశెట్టి శివకృష్ణ

తమ్మిశెట్టి శివకృష్ణ

వి ఆర్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

వి ఆర్ పి ఎస్ వ్యవస్థాపకులు లో ఒక్కడు

గుంజ శ్రీను

గుంజ శ్రీను

వి ఆర్ పి ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి

వడ్డె గంగాధర్

వడ్డె గంగాధర్

వి ఆర్ పి ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి

వడ్డె హనుమంతు

వడ్డె హనుమంతు

వి ఆర్ పి ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి

గుంజి దిలీప్ కుమార్

గుంజి దిలీప్ కుమార్

వి ఆర్ పి ఎస్ రాష్ట్ర కోశాధికారి

D. సంజయ్

D. సంజయ్

వి ఆర్ పి ఎస్ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి

V.  భాను

V. భాను

వి ఆర్ పి ఎస్ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి

గోగుల స్వామి

గోగుల స్వామి

వి ఆర్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్షి మరియు కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

VRPS లక్ష్యాలు

  1. వడ్డెర వర్గానికి ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాటం
  2. వడ్డెర ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధికి కృషి చేయడం మరియు సమస్యలు మరియు మనోవేదనలను తగ్గించడానికి కృషి చేయడం.
  3. రాష్ట్ర ప్రభుత్వం సహా చేసిన BC ప్రజలకు పథకాలు / ఇంటి స్థలాలు , రుణాలు పొందేందుకు కృషి చేయడం.
  4. 50 సంవత్సరాలకు పెన్షన్, మరియు యెటువంటి కార్డులేకపోయిన ప్రమాధంలో మరణించిన కుటుం కోసం 20 లక్షల ప్రభుత్వ సహాయం.
  5. ఉన్నత చదువులు మరియు ఉపాధి కోసం వడ్డెర సంఘంలోని పేద , ప్రతిభావంతులైన మరియు ఇతర అర్హులైన సభ్యులను ప్రోత్సహించడం మరియు సహాయం చేయడం.

VRPS చే నిర్వహించబడే కార్యక్రమాలు మరియు ఇతర సమాచారం ఇక్కడ జోడించబడతాయి.

చరిత్రలో మొట్టమొదటి సారిగా వడ్డెర జాతి అసెంబ్లీ ముట్టడి

మార్చ్ 15, 2022., 60 ఏళ్ల వడ్డెర చరిత్రలో జరిగిన మొదటి చలో అసెంబ్లీ ఇప్పుటి వరకు ఏ వడ్డెర సంఘం నాయకులు కూడా ఈ చలో అసెంబ్లీని నిర్వహించలేదు , వడ్డెర రిజర్వేషన్ పోరాటం సమితి అధ్యక్షుడు, శ్రీ గుంజి సంతోష్ కుమార్ నాయకత్వంలో ఇదే మొదటిది . హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన సమావేశంలో అందుబాటులో ఉన్న నాయకులతో చర్చించి అంధులో తీసుకున్న వివిధ నిర్ణయాలలో ,గుంజి సంతోష్ కుమార్ వడ్డెరాజు గారి ప్రతిపాదన అసెంబ్లి ముట్టడి వివిధ వడ్డెర సంగల నాయకత్వం దినికి ముందడుగు వెయ్యని సందర్బం లో , వీఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది వడ్డెరలతో చలో అసెంబ్లీ జరిగింది . కొంత మంది హైదరాబాద్ స్తానిక సంగాల సహకారంతో అసెంబ్లి ముట్టడి విజయవంతం అయ్యింది.

about-image

ఛలో అసెంబ్లీ -2

2 సెప్టెంబర్ 2022 న వడ్డెర జాతీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో వందల మందితో తెలంగాణాలో అసెంబ్లీ ముట్టడి చేశాము. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి వేలమంది వడ్డెర సోదరులు ఈ ముట్టడికి సహకరించి విజయవంతం చేయ్యాలి అని సిద్ధం అయినప్పటికీ, వారందరిలో చాలా మందిని ఈ అసెంబ్లీ ముట్టడికి రాకుండా ఆపాలి అని చూసిన పోలీసులు చాలా వరకు సఫలం అయ్యారు, మన వడ్డెర బిడ్డలను, యువకులను, వివిధ వడ్డెర సంఘాల నాయకులను ఎక్కడికక్కడ ఇండ్ల వద్దే నిర్భందించి గృహ నిర్భంధం, పోలిసు స్టేషన్ నిర్బంధాన్ని , అమలు చేసీ వడ్డెర్లను భయ బ్రాంతులకు గురిచేశారు, అయినప్పటికి చాలా మంది వడ్డెర యువత వీఆర్పీఎస్ పిలుపుకు గౌరవించి, అధ్యక్షులు న్యాయవాది కావడంతో వడ్డెర జనంలో ధైర్యం నిపడంలో సఫలీకృతం అవ్వడటం వల్ల, యువత ముట్టడికి ముందుకు వచ్చి , ముట్టడిని విజయ వంతం చేసారు. వూరు ధాటి ముట్టడికి వచ్చిన చాలా మంది మన వడ్డెర, కులస్థులకు పోలీసుల నుంచి ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికి వారు వెనుదిరగక, ధైర్యంగా ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు, వారి సాహసానికి వీఆర్పీఎస్ కృతజ్ఞతలు తెలిపింది.

ఎట్టకేలకు 2023 అసెంబ్లీలో కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ . తెలంగాణ అసెంబ్లీలో కేపీ వివేకానంద వడ్డెర ఎస్టీ డిమాండ్ లేవనెత్తారు . వడ్డెరలు న్యాయం కోసం వేడుకున్నారు

బీసీ మేధావులు & రాజకీయ నేతలు మద్దతు వడ్డెర ఎస్టీ రిజర్వేషన్ డిమాండ్

బీసీ మేధావులు & రాజకీయ నేతలు మద్దతు వడ్డెర ఎస్టీ రిజర్వేషన్ డిమాండ్ : ఈ తారాగణంలో వెనుకబడిన మరియు అత్యంత వెనుకబడిన కులాలలో 50 నుండి 100 పైబడిన కులాలు కూడా ఉన్నాయి , ఇవి ఉమ్మడి రాష్ట్రమైన AP మరియు తెలంగాణకు మద్దతు ఇస్తున్నాయి , ఈ కొన్ని మొత్తంగా , అన్ని ఇతర వర్గాల వారు అసెంబ్లీలో తమ సమ్మతిని వ్యక్తం చేసారు చేశారు . శ్రీ కిషన్ రెడ్డి , శ్రీ ఈటెల రాజేందర్ , కేపీ వివేక్ , గద్దర్ వరకు రాజకీయ పార్టీల అగ్రనేతలు , అధికారులు నేరుగా మద్దతు పలికారు . వడ్డెర ఉద్యమం తీవ్రత వడ్డెర (vrps ) ఉద్యమం 1990 ఇప్పటి వరకు ST రిజర్వేషన్ డిమాండ్ కోసం . వడ్డెర ఉద్యమంలో పాల్గొని పోలీసు కేసులు పెట్టి కోర్టులో కొనసాగుతున్నారు . , వడ్డెలు అన్ని అవకాశాలను కోల్పోయారు . బీసీ రిజర్వేషన్ల కోటాను మరింత పెంచాలని వీఆర్‌పీఎస్ డిమాండ్ చేయలేదు , వడ్డెరలకు ప్రత్యేక కోట కూడా కోరలేదు . వారి సామాజిక స్థితికి అనుగుణంగా వారికి సరైన ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు .

వడ్డెర ఎస్టీ రిజర్వేషన్ డిమాండ్

వడ్డెర రిజర్వేషన్ పోరాట సమితి, ప్రభుత్వాలాను కోరుతున్న డిమాండ్ లు (న్యాయమైన కోరికలు)

  1. అన్నిటికన్నా ముందు అన్నీ రాష్ట్రాలలో వడ్డేర్లకు ఓకే జాతి ఒకే రిజర్వేషన్ (ST). 'ఎస్ టి' రిజర్వేషన్ అమలు చెయ్యాలి.
  2. తెలంగాణాలో తొలగించిన అత్యంత వెనుకబడిన తరగతుల జాబితలో తిరిగి చేర్చాలి.
  3. వృత్తిపనిలో ఉన్న వడ్డెర కులస్తూలకు ఉచిత ప్రమాద భీమా తో పాటు, ప్రమాదంలో కుటుంబం సభ్యులను కోల్పోయినా కుటుంబాలకు 2,50,000 ఎక్స్ గ్రేషియ ప్రకటించాలి.
  4. వడ్డెర విద్యాలక్ష్మి పతకం ఏర్పాటు చేసి ఈ పథకం కింద ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటుచెయ్యాలి. 1 నుంచి 10వ తరగతి వరకూ ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 10% సీట్లు వడ్డెర విద్యార్థులకు కేటాయించాలి.
  5. ఉన్నత చదువులు కోసం, మరియూ, వృత్తి, వ్యాపార అవసరాలకు ప్రభుత్వం నుండి ఆర్థికసాయం అందేలా వడ్డెర కార్పోరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 200 కోట్లు కేటాయించాలి.
  6. మహిళలకు చేతివృత్తులలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి సొంత కుటీర పరిశ్రమలు ఏర్పాటు కోసం వడ్డీలేని రుణాలను మంజూరు చేయాలి.
  7. భూమి లేని నిరుపేద వడ్డెర్లకు భూమి, పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తూ సొంత ఇల్లు లేని భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న వడ్డెర్లకు సొంత ఇల్లు మంజూరు చేయాలి.
  8. క్వారీ బ్లాస్టింగ్ లో వడ్డే ఎక్స్ ప్లొజీయర్స్ కు అనుమతులు మంజూరు చేయాలి, ఇప్పటి వరకు నమోదైన కేసులను ఎత్తివేయాలి. మట్టి, రాతి పనులకు, రెవిన్యూ ఫారెస్ట్ అధికారులు అనుమతులు మంజూరు చేయాలి.
  9. ప్రభుత్వ భవనాల నిర్మాణ కాంట్రాక్టులలో వడ్డెర్లను భాగస్వాములుగా చేయాలి. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 'GO' లు అమలు చేయాలి.
  10. వడ్డే ఓబన్న ఆసరా పతకం కింద 50 ఏళ్ల వచ్చిన వడ్డెర కులస్తులకు పెన్షన్ మంజూరు చేయాలి.
  11. వడ్డే ఓబన్న జయంతి, వర్థంతి నాటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి. తెలంగాణ ట్యాంక్ బండ్ మీద వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.

వడ్డెర్ల , ఉద్యమ చరిత్ర (విభజిత తెలుగు రాష్ట్రాలు )

1942, వడియరాజా క్షత్రియ సంగం, కీర్తిశేషులు, శ్రి కే , టీ , వెంకట స్వామి రాజు గారి చెతుల మీద పురుడు పోసుకుని వడ్డెర కుల అభివృద్ధి హక్కులు కోసం బ్రిటీషు వారి హయాంలో సైతం వడ్డేరాజులం అనె నినాదంతో వెంకట స్వామి రాజు గారు, వెనుకబడిన జాతిలో చైతన్యజ్యోతి వెలిగించడానికి నిరంతరం కృషి చేశారు, ఆంధ్ర ప్రదేశ్ అవతరణ తర్వాత తెలంగాణ ప్రాంతం ఆంద్ర రాయలసీమలో అత్యధిక వెనుకబాటుకు గురికావడం చదువు లేకపోవడం, హక్కులు తెలియకపోవడంతో రాజకీయంగా ప్రాతినిధ్యం లేకపోవడం మొదలగు కారణాల వల్ల ఒకానొక సమయంలొ వడ్డెర అనె పదానికి కులాల జబితాలో స్థానం లెని పరిస్థితి 2015 వరకు కొనసాగింది 1990, ఆంధ్ర ప్రదేశ్ వడ్డి,వడ్డే , వడ్డీలు వడ్డే సంక్షేమ సంఘం , గన్ను దెబ్బ , అఖిల భారత వడ్డెర వడ్డే, భోవిసంక్షేమ సంగం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మరికొన్ని సంఘాలు, జాతీయ వడ్డెర సంగం లాంటి పుట్టుకు వచ్చాయి, ఇవ్వన్నీ కుడా అంతో ఇంతో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉనికిలో ఉన్నప్పటికీ ఆ తరువాత తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏ సంగం కూడా అంతగా వడ్డెర హక్కుల కోసం గట్టిగా పోరాటాలు చేసిన సందర్బాలు లెని పరిస్థితి, తెలంగాణా ఏర్పడ్డాక కూడా కొన్ని సంఘాలు పనిచేసిన అవి కేవలం వారి పరిధిలో కొన్నీ కొన్నీ సేవాకార్యక్రమాలు పరిమితం కావడం , ప్రభుత్వానికి అంటుకాగి వ్యతిరేఖ ఉద్యమాలు చేయలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితులు చూసాక, విద్యార్థి నాయకుడు VRPS అధ్యక్షుడు గుంజి సంతోష్ కుమార్ వడ్డేరాజ్ అలోచనకు ప్రతిరూపంగా వడ్డెర సమాజం జిందాబాద్ లు కొట్టడం మానేసి జీవితాలు బాగుచేసుకోవాలి, మత్తు నిద్ర వదిలి హక్కుల పోరటం చెయ్యాలి, గతంలో విద్యలెని నాయకులు, నీతిలేని నాయకులు చేసిన పాపం ఫలితం ప్రస్తుత తరాలు అనుభవిస్తున్న బాధలు, భవిష్యత్తు తరాల కోసం బాధలు, బాధ్యతలు కాదు బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేద్దాం, అడగనిదే అమ్మా అయిన అన్నం పెట్టదు, మన హక్కులు కూడా అంతె, పోరాడకుండా ఫలితాలు రావు, పోరాడుదాం హక్కులూ సాధిద్ధం అధికారంలో భాగస్వాములుగా, భవిష్యత్తు తరాలకు స్థానం ఏర్పాటు అయ్యే వరకూ పోరాడుదాం అని గత 5సంవత్సరాల నుండి పోరాడుతున్న నాయకుని పోరాటానికి మరి కొంత మంది ఉన్నత విద్యావంతుల కలయిక ద్వార రెండూ సంవత్సరాల క్రితం ఏర్పడైనదే వడ్డెర రిజర్వేషన్ పోరాట సమితి (VRPS)

VRPS ఆవిర్భావం తరువాత వడ్డెర జాతి సాధించిన విజయాలు.

  1. TRS, ప్రభుత్వం వడ్డెర నాయకులని ఎన్నికల సందర్భంగా పిలిచి చర్చలు జరిపారు
  2. TRS ప్రభుత్వం కుత్ బుల్లాపూర్ నియోజ వర్గం MLA, కె పి వివేకా గారు వడ్డెర ST డిమాండును అసెంబ్లీ లో ప్రస్త వించడం జరిగింది.
  3. పెద్దల సభలో ఎంపీ, శ్రీ నామ నాగేశ్వర రావు గారు వడ్డెర ST డిమాండును సభ దృష్టికి తేవడం జరిగింది.
  4. మినరల్ కార్పరేశన్ చైర్మన్ మన్నె కృషంక్ గారు, వడ్డెర క్వారీల పనులలో సమస్యలు పరిష్కారం చేస్తాము అన్నారు.
  5. ఉప్పల్ భాగాయత్ లొ ఆత్మగౌరవ భూమి పూజ కార్యక్రమానికి ప్రభుత్వం ముందుకు వచ్చి జరిపించింది.
  6. వివిధ పార్టీలలో వడ్డెర నాయకులకు ప్రాధాన్యం పెరిగింది, కొత్తగ వడ్డెర కులనికి సంబంధించిన యువకులకు పార్టీలలో ప్రాతినిధ్యం దొరికింది.
  7. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లో
  8. VRPS మొదటి డిమాండ్, వడ్డెర ఓబన్న జయంతి అధికారికంగా నిర్వహించాలి

ఈ డిమాండ్ నెరవేరింది, ప్రభుత్వం సొంత ఖర్చులతో ప్రతిజిల్లలో ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సంతోష్ కుమార్ ఇంటర్వ్యూ

అడ్వొకేట్ గుంజి సంతోష్ కుమార్ తో పేస్ టూ పేస్ విత్ మహేష్ ఫుల్ ఇంటర్వ్యూ

video image